EXPEDITE STEPS FOR NBA RECOGNITION TO SV MAHILA POLYTECHNIC- TTD JEO (H&E) _ ఎస్ పి మహిళా పాలిటెక్నిక్ కు మంచి గుర్తింపునకు చర్యలు టీటీడీ జెఈవో ( విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి

Tirupati, 28 December 2021: TTD JEO (Health & Education) Smt Sada Bhargavi directed officials concerned to complete all procedures to procure NBA (National Board of Accreditation) recognition for the SV Mahila Polytechnic at the earliest.

 

Addressing a review meeting with officials at her chambers in the TTD Administrative Building, the TTD JEO said there are 84 Government Polytechnics in Rayalaseema alone and the SVMP has applied for NBA recognition. The institution has already approached the NBA for recognition to the ECE, D Pharmacy, and DCCP courses and also submitted self-appraisal reports to the NBA.

 

The JEO said the NBA team is likely to visit the college for inspection either January last week or February first week.

 
She said measures were afoot to introduce e-Classrooms, new computers LCD projectors, and additional staff and improve greenery with flower and social forestry in the college campus.

 

Devasthanams Education Officer Sri Govindarajan, College principal Smt G Asunta, NAAC coordinator Dr LR Mohan Kumar Reddy, faculty heads Smt Ch Saraswati, Dr M Padmavatamma were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఎస్ పి మహిళా పాలిటెక్నిక్ కు మంచి గుర్తింపునకు చర్యలు

టీటీడీ జెఈవో ( విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 28 డిసెంబరు 2021: శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్  (ఎన్ బి ఎ) నుంచి మంచి గుర్తింపు వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ జెఈవో ( విద్యమరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

మంగళవారం టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో ఆమె కళాశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, రాయలసీమ లోని 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కేవలం టీటీడీ శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఎన్ బి ఎ గుర్తింపు కోసం దరఖాస్తు చేసిందన్నారు. కళాశాల లోని ఈ సి ఈ, డి ఫార్మసీ, డి సి సి పి కోర్సులకు గుర్తింపు కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇందుకోసం సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్టులు కూడా ఎన్ బి ఎ కి సమర్పించినట్లు తెలిపారు.

జనవరి చివరలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ ఎన్ బి ఎ బృందం కళాశాల పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని శ్రీమతి సదా భార్గవి అధికారులకు వివరించారు. ఈ లోపు కళాశాల ఆవరణంలో పూల మొక్కలు, మొక్కలు పెంచి అందంగా తయారు చేయాలన్నారు. ఈ క్లాస్ రూం లు, కొత్త కంప్యూటర్లు, ఎల్సీడి ప్రొజెక్టర్స్, ఇంటర్నెట్ వసతులు కల్పిస్తామని, తగినంత మంది సిబ్బందిని డిప్యూట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దేవస్థానం విద్యాశాఖ ఉపకార్య నిర్వహణాధికారి శ్రీ గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జి.అసుంత, న్యాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎల్ ఆర్ మోహన్ కుమార్ రెడ్డి, విభాగాధిపతులు శ్రీమతి సి హెచ్ సరస్వతి, డాక్టర్ ఎం పద్మావతమ్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది