MATSYA JAYANTI CELEBRATIONS AT NAGALAPURAM TEMLE ON APRIL 3 _ ఏప్రిల్ 3న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

Tirupati, 31 March 2022:  TTD is organising an imposing fete of Matsya Jayanti at Sri Veda Narayanswami temple in Nagalapuram on April 3.

As part of the fete after daily Kainkaryams, the utsava idols of Swami along with His consorts will be taken on a procession in Tiru Veedi Utsavam (Matsya Jayanti) is performed in the morning.

Thereafter Shanti Homam, Snapana Tirumanjanam is conducted in the afternoon and Garuda vahana Seva in the night.

SRI RAMA NAVAMI ASTHANAM ON APRIL 10:

TTD is performing Snapana Tirumanjanam to the utsava idols of Sri Sitarama Lakshmana Sameta Hanuman in the morning followed by Sri Ramanavami Asthanam.

The devotees will have a devotional feast of Sri Sitarama Kalyanam in the afternoon and also blessed by all of them in a procession on temple Mada streets in the evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 3న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

తిరుపతి, 2022 మార్చి 31: నాగ‌లాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం (తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు.

ఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఏప్రిల్ 10న శ్రీరామనవమి ఆస్థానం :

శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో బాగంగా ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. ఉద‌యం 9.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

అనంత‌రం ఉద‌యం 11 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతా రాముల క‌ల్యాణం వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.