KUMARADHARA MUKKOTI CANCELLED DUE TO COVID _ కోవిడ్ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 27న‌ శ్రీ కుమార‌ధార‌ తీర్థ ముక్కోటి ర‌ద్దు

Tirumala, 26 Feb. 21: In view of Covid guidelines, TTD has cancelled Kumaradhara Theertha Mukkoti on February 27.

As the Centre has not yet relaxed Covid norms related to water bodies, TTD has cancelled the torrent fete. The pilgrims are also not allowed.

While the monthly Pournami Garuda Seva will be observed on February 27 between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కోవిడ్ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 27న‌ శ్రీ కుమార‌ధార‌ తీర్థ ముక్కోటి ర‌ద్దు

ఫిబ్ర‌వ‌రి 26, తిరుమల 2021: తిరుమ‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన జ‌ర‌గాల్సిన శ్రీ కుమార‌ధార తీర్థ ముక్కోటి కార్య‌క్ర‌మాన్ని టిటిడి ర‌ద్దు చేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా కుమార‌ధార‌ తీర్థంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తి లేద‌ని టిటిడి స్ప‌ష్టం చేసింది.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.