COMPLETE TIMELY REPAIRS OF ROOM, TTD ADDL EO _ గ‌దుల మ‌ర‌మ్మ‌తులు స‌కాలంలో పూర్తి చేయాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 19 Oct. 21: TTD Additional EO Sri A V Dharma Reddy on Tuesday directed engineering officials to complete the ongoing repair works of rooms and cottages at several locations at Tirumala on war footing and ready them for allotment to devotees.

Addressing a review meeting of officials at Annamaiah Bhavan TTD additional EO instructed officials to remove wastes and garbage surrounding all rest houses and take up beautification steps immediately by promoting greenery.

He asked the engineering and forest officials to clear the wild growth at Mangalakunta near MBC and at Alwar tank near ATC and initiate beautification measures.

He asked officials to identify areas with weak or no mobile signals and coordinate with telecom providers to strengthen to enhance their network at Tirumala.

He wanted the task force set up by the revenue engineering and vigilance departments for to conduct regular inspections and submit reports for the betterment of devotees amenities.

He said the use of plastic screens at shops in Shila thoranam and other areas should be checked and vendors given awareness sessions Steps be initiated for the provision of more and more use of glass bottles and glass cups etc. by vendors in Tirumala.

He suggested the DEO (Devasthanams Education Officer) to appoint more teachers and also enhance interaction with parents of students with the objective of improving the quality of education in all SV higher schools.

He also instructed officials of all departments to dispatch all deadwood and waste materials to the DPW stores. He also reviewed audit objections department wise.

Dharmagiri Veda Pathashala Principal Sri KSS Avadhani, transport GM Sri Sesha Reddy, Additional FA& CAO Sri Ravi Prasad, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, Sri Selvam, Sri Lokanatham, Sri Bhaskar and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

గ‌దుల మ‌ర‌మ్మ‌తులు స‌కాలంలో పూర్తి చేయాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 19: తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో జ‌రుగుతున్న గ‌దుల మ‌ర‌మ్మ‌తుల‌ను స‌కాలంలో పూర్తి చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేయాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అదన‌పు ఈవో మాట్లాడుతూ విశ్రాంతి గృహాల వ‌ద్ద ప‌చ్చ‌ద‌నం పెంచి ప‌రిస‌రాల్లో సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. ఎటిసి ప్రాంతంలోని ఆళ్వార్ ట్యాంకు, ఎంబిసి వ‌ద్ద‌గ‌ల మంగ‌ళ‌బావి కుంటలో క‌లుపు తొల‌గించి సుంద‌రీక‌రించాల‌ని ఇంజినీరింగ్‌, అట‌వీ విభాగాల అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లో సెల్‌ఫోన్ సిగ్న‌ళ్లు స‌రిగాలేని ప్రాంతాల‌ను గుర్తించాల‌ని, సంబంధిత టెలికాం ప్రొవైడ‌ర్ల‌తో చ‌ర్చించి సిగ్న‌ళ్లు బాగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. రెవెన్యూ, ఇంజినీరింగ్‌, విజిలెన్స్ త‌దిత‌ర విభాగాల‌తో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ భ‌క్తుల సౌక‌ర్యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు నిర్వ‌హించి నివేదిక సమర్పించాలన్నారు. శిలాతోర‌ణం, ఇతర ప్రాంతాల్లోని దుకాణాల్లో ప్లాస్టిక్ ప‌ర‌దాలు వాడుతున్నార‌ని, నిషేధంపై వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కోరారు. దుకాణాల్లో గాజు నీటి సీసాలు మ‌రింత ఎక్కువ‌గా అందుబాటులో ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌లో విద్యాప్ర‌మాణాలను పెంచేందుకు ఉపాధ్యాయుల సంఖ్య‌ను పెంచాల‌ని, అధికారులు క్ర‌మం త‌ప్ప‌కుండా సంద‌ర్శించి విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని డిఈవోకు సూచించారు. ఆయా విభాగాల్లో నిరుప‌యోగంగా ఉన్న సామ‌గ్రిని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌కు త‌ర‌లించాల‌న్నారు. అనంత‌రం విభాగాల వారీగా ఆడిట్ అభ్యంత‌రాల‌పై స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ట్రాన్స్‌పోర్టు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ శేషారెడ్డి, అదనపు ఎఫ్ఎ అండ్ సిఎఓ శ్రీ రవిప్రసాదు, డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ సెల్వం, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.