ANNUAL BTU OF SRI PVT FROM JAN 25 TO FEB 3 _ జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 24 Jan. 20: TTD is organising Ankurarpanam on January 25 at the TTD local temple Sri Prasanna Venkateswara Swamy temple in Kosuvaripalle as a part of the annual Brahmotsavams from January 25 to February 3.

Kalyanotsavam is on January 31in which devotees could participate paying ₹300 on which two persons are allowed.  Pushpa yagam is also slated on February 4.

As a part of the event the artists of HDPP and Annamacharya Project will daily present harikatha, Bhakti sangeet and other programs.

Prominent events of the Brahmotsavams are Pedda Sesha vahanam on Jan 27, Hanumanta vahanam on January 29, Garuda vahanam on January 31, Rathotsavam on February 1 and chakra snanam on February 3.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోసువారిపల్లి  శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 24: టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జనవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
       
కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 7 నుండి 9 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                    ఉదయం                   రాత్రి

26-01-2020(ఆదివారం)   ధ్వజారోహణం           పల్లకీ ఉత్సవం

27-01-2020(సోమ‌వారం)  పెద్దశేషవాహనం         హంసవాహనం

28-01-2020(మంగ‌ళ‌వారం)  ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

29-01-2020(బుధ‌వారం)   కల్పవృక్ష వాహనం        హనుమంత వాహనం

30-01-2020(గురువారం)   సూర్యప్రభ వాహనం        చంద్రప్రభ వాహనం

31-01-2020(శుక్ర‌వారం)   సర్వభూపాల వాహనం     కల్యాణోత్సవం, గరుడవాహనం

01-02-2020(శ‌నివారం)    రథోత్సవం                         గజ వాహనం

02-02-2020(ఆదివారం)     పల్లకీ ఉత్సవం                 అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం)   చక్రస్నానం,                         ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.