GURU VANDANA MAHOTSAVAM ON JULY 12-13 _ జులై 12, 13వ తేదీల్లో గురువందన‌ మహోత్సవం

Tirupati,08 July 2022:  The Dasa Sahitya Project of TTD is organising a two-day Guru Vandana Mahotsavam at Dwaraka Tirumala in West Godavari on July 12 and 13 in connection with the auspicious Guru Poornima on July 13.

 

On this occasion, the Gurus of various bhajan mandalis will be grandly felicitated. The festival has so far been held at Malkhed Jayathirtha Sannidhanam,Thirukovilur, Bhadrachalam, Goshpadakshetram at Kovvur near Rajahmundry, Udupi in Karnataka, Mantralayam and Tirumala.

 

Almost 7000 to 8000 devotees are expected to participate in the Fete at Dwaraka Tirumala on the Ashada Pournami /Guru Poornima day.

 

Legends say that on this day Sri Maha Vishnu is incarnated as Vyasa Maharshi in the last lap of Dwapara Yuga and is credited to have scripted great epics like Mahabharata, Bhagavatha, Brahma sutras. Hence the fete of Guru Vandana is being observed as a tribute to the Great Maharshi.

 

The tradition is perpetuated by the TTD Dasa Sahitya project which is sponsoring the Guru Vandana festivities on this day and the activities are being carried out by the Dasa Sahitya Project Special Officer  Sri Ananda Theerthacharyulu under the supervision of All Projects Officer Sri Vijayasaradhi.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

జులై 12, 13వ తేదీల్లో గురువందన‌ మహోత్సవం

తిరుపతి, 2022 జులై 08: టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో జులై 12న గుంటూరు జిల్లా గోవాడ‌లో, జులై 13న పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్ర‌సిద్దిగాంచిన ద్వారకా తిరుమలలో గురువందన‌ మహోత్సవం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా భ‌జ‌న మండ‌ళ్ల గురువుల‌ను ఘ‌నంగా స‌న్మానిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు వివిధ నదీ తీరాల్లో, మల్ఖేడ జయతీర్థుల సన్నిధానం, తిరుక్కోయిళూరు, భ‌ద్రాచ‌లం, రాజమహేంద్రవరం వ‌ద్ద‌గ‌ల కొవ్వూరు గోష్పాదక్షేత్రం, ఉడిపి క్షేత్రం, మంత్రాలయం, తిరుమల త‌దిత‌ర పుణ్య‌క్షేత్రాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ద్వార‌కాతిరుమ‌ల‌లో జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో సుమారు 7 వేల నుండి 8 వేల‌ మంది వరకు భక్తులు స్వ‌చ్ఛందంగా పాల్గొన‌నున్నారు. ఆషాఢ పౌర్ణ‌మిని వ్యాస పౌర్ణ‌మి, గురు పౌర్ణ‌మి అంటారు. సాక్షాత్ శ్రీమహావిష్ణువు ద్వాపర యుగం చివరి భాగంలో వ్యాస భగవానుడిగా అవతరించారు. మహాభారతం, భాగవతం, బ్రహ్మ సూత్రాలు లాంటి అద్భుత వాఙ్మయరాశిని సృష్టించిన వ్యాస భగవానుడికి ప్రతిరోజూ గురువందనం చేయాల్సిందే. పూర్వ‌కాలంలో ఋషులు, మునులు ఆషాఢ పౌర్ణ‌మి రోజు వ్యాస భగవానుడిని పూజించేవారు. ఈ సంప్ర‌దాయాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు కొనసాగిస్తూ ప్ర‌తి ఏటా గురువందన మహోత్సవం నిర్వ‌హిస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.