జూన్ 16 నుండి 21వ తేది వరకు హిమయత్‌ నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు

జూన్ 16 నుండి 21వ తేది వరకు హిమయత్‌ నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవములు

హైదరాబాదు, 2010 జూన్‌ 15: హైదరాబాద్‌, హిమయత్‌ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానముల బాలాజీభవన్‌ నందు వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 16వ తేది నుండి 21వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. 16వ తేది సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు ప్రతి రోజు క్రింది వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
17-06-2010 ధ్వజారోహణం (ఉ.10.00 గంటలకు) శేష వాహనం
18-06-2010           – హనుమంత వాహనం
19-06-2010 గజవాహనం గరుడ వాహనం
20-06-2010 రథోత్సవం (ఉ.7.50 గంటలకు) అశ్వ వాహనం
21-06-2010 చక్రస్నానం (ఉ.8.00 గంటలకు) –

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరునిలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ పుస్తక ప్రదర్శనలో హైందవానికి  చెందిన ఎన్నో విలువైన గ్రంథాలు, పురాణపురుషులు, వివిధ దేవతామూర్తులు, ధర్మసూత్రములు, భారతభాగవతములకు చెందిన వివిధ రకాల పుస్తకాలతో పాటు పలురకాల సిడీలు, డివిడీలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.