APPALAYAGUNTA TEMPLE BRAHMOTSAVAM FROM JUNE 19-27 _ జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 31 May 2021: TTD will be organising annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta from June 19 to 27 in Ekantam in view of Covid guidelines.

As part of festivities, TTD is conducting the holy Koil Alwar Tirumanjanam fete on June 15 and Ankurarpanam on June 18 evening followed by the Dwajarohanam ceremony on June 19.

In connection with the festivities of the nine-day event, TTD will observe Tiruchi utsava both morning & evenings and Asthanam inside the temple premises instead of Vahana Sevas.

Among other major events during the Brahmotsavams are: Srivari Arjita Kalyanotsavam on the evening of June 22, Snapana Tirumanjanam of utsava idols of Sri Prasanna Venkateswara Swamy and His consorts along with the Sri Sudarshan Chakrathalwar on June 27 morning followed by Chakrasnanam. Later the Dwajavarohanam will be conducted to herald the conclusion of the nine-day annual Brahmotsavams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 మే 31: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాల‌ను ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా జూన్ 15న ఉద‌యం 8.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య‌ ధ్వజారోహణం జరుగనుంది.

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల‌ వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.