PALLAVOTSAVAM AT TIRUMALA ON JULY 20 _ జూలై 20న తిరుమలలో పల్లవోత్సవం

జూలై 20న తిరుమలలో పల్లవోత్సవం

తిరుమల, 2022 జూలై 19: మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ జూలై 20వ తేదీ పల్లవోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు,మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు.

మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తూవ‌స్తున్న‌ది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం

శ్రీవారికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తి భావంతో భూరి విరాళాలు అందించారు. ఇందులో భాగంగా మూలవిరాట్టుకు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అముల్యమైన అభరణాలు బహుకరించారు.

అదేవిధంగా బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్ర ప్రభ వాహనాలు అందించారు. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ఆయన ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.

ప్రతి రోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతి రోజు 5 కేజిల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించగా, అది నేటికి కొనసాగుతున్న‌ది.

మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీమలయప్పస్వామివారు కర్ణాటక సత్రాలకు విచ్చేసి ఉట్లోత్సవం అనంతరం ఆలయానికి చేరుకుంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 19 July 2022: TTD is organizing the Pallavotsavam fete in Tirumala on July 20 in recognition of Mysore Maharaj birth star of Uttarabhadra Nakshatra.

As part of festivities, a grand procession of Sri Malayappa and His consorts will reach Karnataka choultries after the Sahasra Deepalankara seva. Mysore Samsthan and Karnataka Government representatives will present special harati on the occasion.

TTD is conducting the Pallavotsavam fete from the last 300 years which was earlier known as Tototsavam. After special puja to the utsava idols, harati, naivedyam and Prasadam will be distributed to devotees.

LEGEND

Mysore Maharaj is well known as an ardent devotee of Sri Venkateswara and reportedly presented huge amounts of jewels made of gold, diamonds and other precious stones.

Every day, five kg of ghee is provided for the Navneeta harati and akhanda Brahma Deepam, a practice continued even today in Tirumala temple in dedication to Mysore Maharaj.

Hence on the day of Uttarabhadra Nakshatra a special Asthana is conducted in Srivari temple in memory of Mysore Maharaj and a special harati is also performed during Ugadi, Deepavali and Anivara Asthana fetes.

Particularly on the Sri Krishna Janmashtami day and during the Utlotsavam fete Sri Malayappa pays a special visit to Karnataka choultries and after festivities returns to the temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI