SRI PRATIVADI BHAYANKARA ANNAN SATTUMORA AT SRI GT ON JULY 29 _ జూలై 29న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర

Tirupati, 21 July 2022: TTD will be organising the Sri Prativadi Bhayankara Annan Sattumora at Sri Govindaraja Swamy temple on July 29 on his birth Nakshatra.

As part of the festivities, Srivari Appapadi Prasadam will be brought in a procession to Sri Lakshmi Narayana temple in Tirupati and Sattumora fete is performed.

 LEGEND

Born in Kanchipuram Sri Prativadi Bhayankara Annan was a well-known Sanskrit pundit and Sri Vaishnava Saint who penned the Suprabatham, Prapatti and Mangala Sasanam which are in vogue at Tirumala Srivari temple to date.

He was also credited for scripting commentaries for epics like Sri Bhashyam, Sri Bhagavatham etc. Hence in recognition of his devotion and services to Sri Venkateswara Swamy, TTD is organising sattumora fete every year on this auspicious day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUMALA

జూలై 29న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర

తిరుపతి, 2022 జూలై 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29వ తేదీ శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర ఘనంగా నిర్వహించ‌నున్నారు.

ఈ సందర్భంగా ఉదయం తిరుమల నుంచి శ్రీవారి అప్పాపడి ప్రసాదాన్ని తిరుప‌తిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్తు మొర నిర్వ‌హిస్తారు.

ప్రాశస్త్యం :

శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీ.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.