ARADHANOTSAVAMS OF SRI PURANDARA DASA FROM JAN 23-25 _ జ‌న‌వరి 23 నుండి 25వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

జ‌న‌వరి 23 నుండి 25వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 21: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జ‌న‌వరి 23 నుంచి 25వ తేదీ వరకు తిరుమలలో ఘ‌నంగా జరుగనున్నాయి.

మొదటిరోజైన జ‌న‌వరి 23న గురువారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సాహిత్య‌ గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రెండవ రోజైన జ‌న‌వరి 24న శుక్ర‌వారం ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.

చివరిరోజు జ‌న‌వరి 25న శ‌నివారం ఉదయం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Tirumala, 21 January 2020: The Dasa Sahitya Project of TTD is rolling out all arrangements for grand conduction of the Aradhanotsavam of Carnatic music exponent Sri Purandara Dasa from January 23-25 in Tirupati and Tirumala.

On January 23 grand bhajans, meditation, sankeertans are organised followed by Mangalasanams by pontiffs of several mutts.

On the second day on January 24, garlanding of Sri Purandara Dasa statue at Alipiri and later parade of Srivari utsava idol from Srivari temple to Narayanagiri gardens, Unjal seva and Dasa sankeertans are scheduled.

On the last day on Saturday on January 25, bhajans, sankeertans and Haridasarasa Manjari programs are planned as a part of the celebrations.

The Special Officer of the Dasa Sahitya Project Sri Anandathirtha charyulu is supervising all the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI