TIRUPPAVAI DISCOURSE AT ANNAMACHARYA KALA MANDIR FROM DEC 15 _ డిసెంబరు 15న అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

Tirupati, 13 Dec. 20: After series of Karthika Masa Spiritual programs, TTD has now set to organise Tiruppavai parayanams at Annamacharya Kala mandiram in Tirupati from December 15 onwards.

The Alwar Divya Prabandha Project of TTD is organising Tiruppavai pravachanas at 141 centres across the country during holy Dhanur masam. The Pasura Parayanams will be recited from Dec.16 till 2021 January 13.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 15న అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 13: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 15న మంగళవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరుగనుంది.

టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నారాయ‌ణ‌వ‌నంలోని శ్రీ హ‌రేరామ హ‌రేకృష్ణ ఆల‌యం, కుప్పం మండ‌లం గుడిప‌ల్లిలోని శ్రీ యామ‌గానిప‌ల్లెలో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.

ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీకృష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.