SEVENTH EDITION OF SUNDARAKANDA AT VASANTA MANDAPAM _ డిసెంబరు 6న వ‌సంత మండ‌పంలో 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 5 Dec. 20: Seeking blessings of Sri Venkateswara and spiritual sanctions against pandemic Corona, TTD is organising the seventh edition of Sundarakanda Akhanda Parayanam on  December 6 at Vasantha Mandapam in Tirumala.

TTD has shifted location from Nada Neeranjanam to Vasantha Mandapam in view of incessant rainfall at Tirumala.

A total of 194 shlokas from six chapters of 25-30 sargas will be recited by Vedic pundits from 7am onwards and telecast live by the SVBC channel.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

డిసెంబరు 6న వ‌సంత మండ‌పంలో 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2020 డిసెంబ‌‌రు 05: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని వ‌సంత మండ‌పంలో‌ డిసెంబరు 6వ తేదీ 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. తిరుమ‌ల‌లో వ‌ర్షం కార‌ణంగా నాద‌నీరాజ‌నం వేదికపై కాకుండా వ‌సంత మండ‌పంలో ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. కావున ఈ మార్పును భ‌క్తులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.  

ఆదివారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.
                      
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.