SRIVARI SARE PRESENTATION TO GODESS PADMAVATHI ON DEC 1 _ డిసెంబ‌రు 1న తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి సారె

Tirumala, 19 Nov. 19: On the final day of the Kartika Brahmotsavams Goddesses Sri Padmavathi, the day of Panchami theertha, December 1, the tradition of presentation of sare from Srivari temple will be done.

On the appointed day a grand silk saree with few ornaments, Tulasi, kumkuma and pradadam will be brought on an elephant procession on four mada streets up to Bedi Anjaneya temple.

There after special pujas will be performed for the sare etc. at Alipiri Padala mandapam from where it will be brought to Tiruchanoor Pasupathi mandapam in fanfare with bhajan, kolata and cultural teams along streets of Tirupati.

After another round of rituals the TTD officials and archakas will take the saree upto Padmavathi Pushkarani.

SRIVARI LAKSHMI KASULA HARAM PROCESSION ON NOVEMBER 27

Similarly the precious ornament of lord Venkateswara, the Lakshmi kasula haram will also be brought to Tiruchanoor for the Padmavathi Ammavari Brahmotsavams.

On November 27 the ornament will be paraded on made streets in the morning and later transported to the Pasupathi mandapam at Tiruchanoor from where it will be taken to Sri Ammavari temple in grand procession.

The priceless ornament will be adorned to the Ammavari utsava idol during the Gaja vahana seva on November 27 evening. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

డిసెంబ‌రు 1న తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి సారె

తిరుమల, 2019 నవంబరు 19: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన డిసెంబ‌రు 1న‌ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించ‌డం జ‌రుగుతుంది. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

 ఇందులో భాగంగా డిసెంబ‌రు 1న ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె గజాలపై ఊరేగింపుగా మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంకు చేరుకుంటుంది. తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్దకు చేరుకున్న సారెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  అక్కడినుంచి భజనలు, కోలాటాలు తదితర కళాబృందాల నడుమ కోమలమ్మ సత్రం (ఆర్‌ఎస్‌గార్డెన్‌), తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి ఉద‌యం 9.00 గంట‌ల‌కు సారె చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి  పుష్కరిణి వద్దకు సారెను తీసుకువెళ్ల‌తారు.

నవంబరు 27న శ్రీవారి లక్మీకాసుల హారం ఊరేగింపు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 27వ తేదీ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం  ఊరేగింపు  జరుగనుంది.  శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగించ‌నున్నారు.
     
 అనంత‌రం ఈ హారంను అధికారులు ఉదయం 9 గంటలకు తిరుమలలో బయల్దేరి, తిరుచానూరులోని పసుపు మండపానికి  తీసుకొస్తారు. అనంతరం ప‌సుపు మండ‌పం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు.

న‌వంబ‌రు 27వ తేదీ సాయంత్రం జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.