SRINIVASA KALYANAM ENTHRALLS AUDIENCE _తిరుపతివాసులను ఆకట్టుకున్న “శ్రీనివాస కల్యాణం”

TIRUPATI, 29 SEPTEMBER 2022:  The dance ballet presented by 40 students of TTD-run SV College of Music and Dance on Srinivasa Kalyanam enthralled the art lovers in Mahati Auditorium in Tirupati on Thursday evening.

Under the guidance of the Dance lecturer, Smt Uma Muddubala, and under the supervision of Principal Sri Sudhakar, the students presented the colorful dance form which won the hearts of the audience.

CAO Sri Sesha Sailendra, AEO Sri Chaturvedula Satyanarayana, and others were also present.

In Annamacharya Kalamandiram, the devotional musical concert by Sri Sabari Girish, the bhakti sangeet in Ramachandra Pushkarini also attracted devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతివాసులను ఆకట్టుకున్న “శ్రీనివాస కల్యాణం”

                 
 
తిరుపతి, 2022 సెప్టెంబ‌రు 29 ; బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గురువారం తిరుపతి మహతి ఆడిటో రియంలో తి తి దే  సంగీత నృత్య కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థినీ విద్యార్థుల బృందం  ప్రదర్శించిన  “శ్రీనివాసకల్యాణం” నృత్యరూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. భరతనాట్య అధ్యాపకురాలు శ్రీమతి ఉమాముద్దుబాల మార్గదర్శనంలో, ప్రిన్సిపాల్ తిరుపతి సుధాకర్ పర్యవేక్షణలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ సంగీత నృత్య రూపకానికి హరికథకులు గుడిపాటిభాస్కరశర్మ రూపకల్పన చేశారు. ఇందులో శ్రీనివాసుడిగా సాయికిషోర్ బోస్, పద్మావతిగా హర్షితానాయుడు, వకుళమాతగా సాయిలక్ష్మి మొదలైన వారు అభినయించారు.

 

 
ఈ కార్యక్రమంలో  తి తి దే చీఫ్ ఆడిట్ ఆఫీసర్ మరియూ సంగీత నృత్య కళాశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీ కొప్పరపు శేషశైలేంద్ర, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఎఇఓ శ్రీ చతుర్వేదుల సత్యనారాయణ, అన్నమాచార్య ప్రాజెక్టు పూర్వ సంచాలకులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తిశర్మ, సప్తగిరి ఉపసంపాదకురాలు డా.అల్లాడి సంధ్య,  మరియు తిరుపతి వాసులు  పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.
 
 
 
అదేవిధంగా, అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరిగిరీష్ బృందం ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు చ‌క్క‌గా ఆల‌పించారు. రామ‌చంద్ర పుష్క‌రిణిలో సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వాద్య సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.
          
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.