BHAKTHI CHAITANYA YATRA- SRI NARASIMHA RADHAM REACHES TIRUPATI _ తిరుపతి చేరుకున్న శ్రీనృసింహరథం

Tirupati, 25 June 2008: As part of Chaturyuga Bandham Bhakti Chaitanya Yatra, the “Sri NARASIMHA RADHAM” reached Tirupati on June 25. Pujas are performed to the Lord on Sri Rama Radham at Ramanuja circle at 8.30AM. Later the Radham was taken out in a procession to Aliperi.

Sri Dheekshitulu acted as in charge of the Radham.

TTD Board Members Sri O.V.Ramana, Dr Chavireddy Bhaskar Reddy addressed the devotees at Aliperi.

Sri VSB Koteswara Rao, Chief Engineer, Dr Vijayaraghava charyulu, Secretary DPP, Dr Medasani Mohan, Director Annamacharya Project, Sri P.V.Sesha Reddy, G M Transport, Sri Vasudevan, DyE.O Local Temples, Sri Chengalrayulu, DyE.O, Sri Seshadhri, OSD and others have participated in this programme. massive response from global devotees ever since its commencement.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతి చేరుకున్న శ్రీనృసింహరథం

తిరుపతి, జూన్‌-25,  2008: చతుర్యుగ బంధం – భక్తి చైతన్యయాత్ర కార్యక్రమంలో బాగంగా జూలై 25వ తేదిన శ్రీనృసింహరథం తిరుపతికి చేరుకున్నది. ఈసందర్భంగా ఉదయం 7.30 గం||లకు తిరుపతిలోని శ్రీరామానుజ సర్కిల్‌ వద్ద నుండి తుడ ఆఫీసు, మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆఫీసు, తి.తి.దే., పరిపాలనా భవనం. హరేరామ రోడ్డు మీదుగా అలిపిరి వద్దకు చేరుకున్నది.

ఈ సందర్భంగా తి.తి.దే., పాలకమండలి శ్రీచెవిరెడ్డి బాస్కరెడ్డి మాట్లాడుతూ చతుర్యుగ బంధం రహస్యం ధర్మవ్యాప్తి అని, పాప సంహారమైనదే ఈ యాత్ర అని చెప్పారు. 26 రోజుల పాటు ఈ భక్తి చైతన్య యాత్రలో వేలాది మంది భక్తులు పనిచేసినారని వారందరికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తి.తి.దే., పాలకమండలి సభ్యులు శ్రీఓ.వి.రమణ, హిందూధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా||విజయరాఘవాచార్యులు, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీవి.ఎస్‌.బి.కోటేశ్వరావు, డా||మేడసానిమోహన్‌, శ్రీఅనందతీర్థాచార్యులు, శ్రీపి.వి.శేషారెడ్డి మరియు వేలాది మంది భక్తులు భజన సంఘాలు పాల్గొన్నారు.

శ్రీనృసింహరథం మేనెల 30వ తేదిన సింహాచల క్షేత్రం నుండి బయలుదేరి జూన్‌ 25వ తేదిన తిరుపతికి చేరుకున్నది. దాదాపు 26 రోజులపాటు, 1093 కిలోమీటర్లు ప్రయాణించింది దాదాపు 2000 గ్రామాలు, పట్టణాలలోని లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీనివాసదీక్షితులు కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా ఇతర సిబ్బంది ఈ రథం వెంట వేలాది ప్రాతాంల ద్వారా యాత్రలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.