RADHA SAPTHAMI AT TIRUMALA ON FEBRUARY 10 _ తిరుమలలో ఫిబ్రవరి 10న రథసప్తమి 

TIRUMALA, FEBRUARY 3:  The annual ‘Rathasapthami’ festival will be celebrated with utmost religious fervour in Tirumala on February. The temple management of TTD has cancelled all arjitha sevas on that day in view of this auspicious occasion.

   Tens of thousands of devotees from all over the country, congregate atop the sacred shrine to participate in the mega event also popularly known as ‘Surya Jayanthi’ festival. This festival is also called “Mini Brahmotsavams” as the processional deity of Lord Malayappa Swamy takes a pleasure ride on seven vahanams on a single day starting from morning 5:30am till 9pm in the night.

  Mounted atop seven different vahanams including Suryaprabhachinna Sesha, Garuda, Hanumantha, Kalpavriksha, Sarvabhoopala and Chandra Prabha, the Malayappa Swamy will grace the pilgrims all along the four mada streets at diifferent intervals.

Among all the Vahanams, Surya Prabha and Garuda are considered to be the most important ones. The festival commences with “Suryaprabha Vahanam’ in the wee hours as tens of thousands of pilgrims congregate in the north-west corner of the temple town as early as 4.00 a.m. to catch the rare sight of ‘first rays’ of the sun falling on the forehead, abdomen and feet of the deity mounted atop the Golden ‘Suryaprabha Vahanam’. This vahanam procession will take place from 5:30am to 8am. It will be a celestial fete to the eyes of the devotees to see the lord dazzle in the first sun rays of the day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఫిబ్రవరి 10న రథసప్తమి

తిరుపతి, ఫిబ్రవరి – 03, 2011: తిరుపతి, ఫిబ్రవరి – 03, 2011:  ప్రతి సంవత్సరం మాఘ శుద్ధసప్తమి సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమలలో నిర్వహించే రథసప్తమి ఉత్సవాన్ని ఈనెల 10వ తారీఖున వైభవంగా నిర్వహించనున్నారు.

 ఈ సందర్భంగా ఆనాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అర్జితసేవలను రద్దుచేయడమైనది. ఈ పర్వదినం సందర్భంగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామివారు మేరునగగాంభీర్యంతో, సర్వాలంకారభూషితుడై, ఏడు ప్రధానవాహనాలపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తాడు.
 
ఆరోజు ఉదయం ఉదయభానుని తొలిరేఖలు సూర్యప్రభవాహనంపై కొలువైవున్న స్వామివారి లలాటపలకం, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుతమైన దృశ్యాన్ని తిలకించి తన్మయత్వంచెంది తరించడానికి వేలాది మంది భక్తులు ఉదయాత్పుర్వమే నాలుగు మాడవీధులలో ఉత్సుకతతో నిరీక్షించడం ఆనవాయితి. ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైయ్యే సూర్యప్రభవాహనం సుమారు ఉదయం 8.00 గంటల వరకు కొనసాగుతుంది.
               
అనంతరం స్వామివారు ఉదయం 9గంటలకు – చిన్నశేష వాహనంపై, ఉదయం 11గంటలకు- గరుడ వాహనంపై, మధ్యాహ్నాం 1గంటకు- హనుమంతవాహనంపై ఊరేగుతూ భక్తజనులకు నేత్రానందాన్ని కల్గిస్తారు. కాగా మధ్యాహ్నం 2గంటలకు- చక్రస్నానం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 4గంటలకు – కల్పవృక్షవాహనంపై, సాయంత్రం 6గంటలకు – సర్వభూపాలవాహనంపై, సాయంత్రం 8గంటలకు – చంద్రప్రభవాహనంపై తిరుమాడవీధులలో తిరుగాడుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
                 
ఒకే రోజు భక్తులను ఏడు వాహనాలపై ఊరేగుతూ శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో కనువిందుచేస్తాడు గనుక ఈ రథసప్తమి పర్వదినాన్ని భక్తులు  అర్థబ్రహ్మోత్సవమని, ఒకరోజు బ్రహ్మోత్సవమని వ్యవహరిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.