SABHA PARVA PARAYANAM BEGINS AT NADA NEERAJANAM _ తిరుమ‌ల‌లో స‌భాప‌ర్వం పారాయణం ప్రారంభం

Tirumala, 1 Jun. 22:  The spiritual agenda of TTD seeking Srivari blessing for the well-being of humanity entered a new phase with the commencement of the parayanams of Sabha Parva (Sabha Parvam- Dharma Saram) from epic Mahabharata at Nada Neeranjanam platform on Wednesday.

Speaking on the occasion Vedic pundit of Dharmagiri Veda vijnan peetham, Dr P Venkatachalapathi said the Sabha Parva focused on the glory of Sri Krishna and highlighted on the message of dharma Plain in society.

Sabha Parva is comprised of 81 chapters, 10 sub-Parvas, 3700 shlokas

During the parayanam he gave commentary while pundit Sri Raghavendra chanted the shlokas. He appealed to devotees to follow the program which was telecast on SVBC daily between 8-9 Pm.

Veda pundits, devotees and TTD officials were present in large numbers.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో స‌భాప‌ర్వం పారాయణం ప్రారంభం

తిరుమ‌ల‌, 2022 జూన్ 01: శ్రీ‌వారి పరిపూర్ణానుగ్రహంతో సృష్టిలోని స‌కలజీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధ‌వారం రాత్రి మహాభారతంలోని “స‌భాప‌ర్వం – ధర్మసారం” కార్యక్రమం ప్రారంభ‌మైనది.

ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డా. పైడిపాటి వేంకటాచ‌ల‌ప‌తి మాట్లాడుతూ వ్యాసమ‌హ‌ర్షి అందించిన మ‌హాభారతంలోని 18 ప‌ర్వాలలో స‌భాప‌ర్వం రెండ‌వ‌ద‌న్నారు. లోకానికి ధ‌ర్మాన్ని అందించే ఈ పర్వంలో ప్రధానంగా శ్రీకృష్ణభ‌గ‌వానుని దివ్య‌మైన వైభ‌వాన్ని తెలియజేశారన్నారు. స‌భాప‌ర్వంలో ఉన్న ప్ర‌తి విష‌యం సమాజంలో ధర్మాచరణ ఏ విధంగా చేయాలి అన్న సందేశం ఇస్తుంద‌న్నారు.

స‌భాప‌ర్వంలో 81 అధ్యాయాలు, 10 ఉప పర్వాలు, 3700ల శ్లోకాలు ఉన్నాయ‌న్నారు. స‌భాప‌ర్వం పారాయ‌ణ‌ము చేసిన‌, విన్నా సమస్తపాపములు తొలగి ధర్మమార్గంలో నడవగలిగే శక్తి ల‌భిస్తుందన్నారు. మ‌హాభార‌తం నేటి స‌మాజంలో మాన‌వాళికి ఎలా ఉప‌యోగప‌డుతుందో వివ‌రించారు.

త‌రువాత ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం ఆచార్యులు డా. వేంక‌టాచ‌ల‌ప‌తి “స‌భాప‌ర్వం”లోని శ్లోకాల‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌గా, తంత్రసారాగమ పండితులు శ్రీ రాఘ‌వేంద్ర శ్లోకాల‌ను ప‌ఠించిన తరువాత, సుభాషితమ్ అన్న శీర్షికన నీతి శ్లోకాన్ని వివరించారు. ఈ కార్య‌క్ర‌మాన్నిఎస్వీబిసి ప్ర‌తి రోజు రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంద‌ని, భ‌క్తులు ఈ శ్లోకాల‌ను ప‌ఠించాల‌ని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో వేదపండితులు, టీటీడీ అధికారులు, విశేషసంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.