ANNUAL BTUs OF AMMAVARU AT CHENNAI INFO CENTRE _ న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు చెన్నైలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 14 Nov. 19: The annual brahmotsavams of Sri Padmavathi Devi will be observed from November 23 till December 2 at the TTD Information centre in Chennai.

This annual event will be observed on par with Tiruchannor Padmavathi Ammavari Brahmotsavams.

The important days includes Chinna Sesha Vahanam on November 23,  Gaja Vahanam on November 27,  Garuda Vahanam on November 28, Panchami Theertham on December 1 and Pushpayagam on December 2.

Every day the vahana seva commences at 6:30pm. AEO Sri Muralidhar is supervising the arrangrments.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు చెన్నైలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

 తిరుపతి, 2019 నవంబరు 14: చెన్నై న‌గ‌రంలోని టిటిడి స‌మాచార కేంద్రంలో గ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల త‌ర‌హాలో ఇక్క‌డ ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం విశేషం. తొమ్మిది రోజుల పాటు సాయంత్రం 6.30 గంట‌ల‌కు వాహ‌న‌సేవ జ‌రుగుతుంది. ఆయా వాహ‌నాల్లో అమ్మ‌వారిని కొలువుదీర్చి స్వామివారి ఎదుట వేంచేపు చేసి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. గ‌జ‌వాహ‌నం రోజున మాత్రం అమ్మ‌వారిని ఆల‌యం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హిస్తారు. టిటిడి ఏఈవో శ్రీ టి.ముర‌ళీధ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలిలా ఉన్నాయి.

న‌వంబ‌రు 23న – చిన్న‌శేష వాహ‌నం
న‌వంబ‌రు 24న – హంస వాహ‌నం
న‌వంబ‌రు 25న – సింహ వాహ‌నం
న‌వంబ‌రు 26న – క‌ల్ప‌వృక్ష వాహ‌నం
న‌వంబ‌రు 27న – గ‌జ వాహ‌నం
న‌వంబ‌రు 28న – గ‌రుడ వాహ‌నం
న‌వంబ‌రు 29న – చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నం
న‌వంబ‌రు 30న – అశ్వ‌ వాహ‌నం
డిసెంబ‌రు 1న – పంచ‌మి తీర్థం
డిసెంబ‌రు 2న – పుష్ప‌యాగం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.