BHAGAVAD GITA PRAVACHANAM AND PARAYANA MAHOTSAVAM FROM NOVEMBER 27 – DECEMBER 14 _ న‌వంబ‌రు 27 నుండి డిసెంబ‌రు 14వ తేదీ వ‌ర‌కు భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం, పారాయ‌ణం

Tirupati, 24 Nov. 21: TTD will be organizing Bhagavad-Gita Pravachanam & Parayana Mahotsavam at 18 prominent temples from November 27-December 14 across South India.

 

As part of this religious event, 18 prominent Vedic pundits will perform the pravachanam and parayanam of 18 chapters of Bhagavad-Gita for 18 days in 18 prominent temples across Tirupati, Devuni Kadapa, Vontimitta, Hyderabad, Bangalore and Chennai.  Similarly, under the supervision of the AP Endowment department, such pravachanam and parayanam are being conducted at prominent temples of Arasavilli in Srikakulam, Simhachalam, Annavaram, Dwaraka Tirumala, Mangalagiri, Nellore, Kadiri, Ahobilam temples every day in the evening.

 

TTD has appealed to devotees to participate in the programs at their respective places and beget blessings of Sri Venkateswara.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

న‌వంబ‌రు 27 నుండి డిసెంబ‌రు 14వ తేదీ వ‌ర‌కు భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం, పారాయ‌ణం

తిరుపతి, 2021 న‌వంబరు 24: టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో న‌వంబ‌రు 27 నుండి డిసెంబరు 14వ తేదీ వ‌ర‌కు 18 ప్ర‌ముఖ‌ ఆల‌యాల్లో 18 మంది ప్రముఖ పండితులు 18 రోజుల పాటు భ‌గ‌వ‌ద్గీతలోని 18 అధ్యాయాల‌ను ప్రవచనం, పారాయ‌ణం చేయ‌నున్నారు.

ఇందులో భాగంగా టిటిడి అనుబంధ ఆల‌యాలైన తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యం, ఉప‌మాక‌, పిఠాపురం, అప్ప‌లాయ‌గుంట‌, నారాయ‌ణ‌వ‌నం, ఒంటిమిట్ట, దేవుని క‌డ‌ప‌, హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బెంగూళూరు, చెన్నైలో భ‌గ‌వ‌ద్గీత ప్రవచన, పారాయ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా దేవదాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలోని అర‌స‌విల్లి, సింహాచ‌లం, అన్న‌వ‌రం, ద్వార‌కా తిరుమ‌ల‌, మంగ‌ళ‌గిరి, నెల్లూరులోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యం, క‌దిరి, అహోబిలం ఆల‌యాల్లో ప్ర‌తి రోజు సాయంత్రం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌ముఖ పండితులు ప్రవచనం, పారాయ‌ణం చేస్తారు.

భ‌క్తులు ఆయా ఆల‌యాల్లో భ‌గ‌వ‌ద్గీత ప్రవచనం పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని, ధ‌ర్మనిర‌తులు కాగ‌ల‌రు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.