SRI KONDANDA RAMA SWAMY PROCESSION AT KUPUCHANDRA PETA ON FEB 10 _ ఫిబ్రవరి 10న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

Tirupati, 9 February 2020: TTD is organising a grand procession of utsava idols of Sri Kodanda Rama Swamy and his consorts at Kupuchandrapeta about 8 kms away from Tirupati on Monday.

It is a tradition that the utsavam is held in this village every year on the Pournami day of Magha masam. The utsava idols are brought in procession in the morning where snapana thirumanjanam and unjal seva are performed and the idols are brought back to Tirupati in the evening.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 10న కూపుచంద్రపేటకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 09: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 10వ తేదీ కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 10.00 నుండి 11.30 గంటల వ‌ర‌కు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ‌, సాయంత్రం 5.00 గంటలకు అక్కడి నుండి బయల్దేరి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.