ఫిబ్రవరి 5వ తేది నుండి 14వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 5వ తేది నుండి 14వ తేది వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2010 ఫిబ్రవరి 04: తిరుపతిలో వెలసిన శ్రీకపిలేశ్వరస్వామి వారి వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 5వ తేది నుండి 14వ తేది వరకు కన్నుల పండుగగా జరగనున్నవి. 4వ తేదిన అంకురార్పణ ఘనంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదిన శివపార్వతుల కల్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ కల్యాణంలో పాల్గొనదలచిన దంపతులు రూ.250/- చెల్లించి పాల్గొనవచ్చును. ఈ బ్రహ్మోత్సములలో శ్రీ కపిలేశ్వరస్వామివారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి పురవీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందైన దర్శన భాగ్యం కల్పిస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
05-02-2010 ధ్వజారోహణం(ఉ.9.19 గంటలకు) హంసవాహనం
06-02-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-02-2010 భూత వాహనం సింహ వాహనం
08-02-2010 మకర వాహనం శేష (నాగ) వాహనం
09-02-2010 నంది వాహనం తిరుచ్చి ఉత్సవం
10-02-2010 వ్యాఘ్ర వాహనం గజ వాహనం
11-02-2010 కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం
12-02-2010 రథోత్సవం(ఉ.7.00 నుండి 9.00 వరకు) నంది వాహనం
13-02-2010 పురుషామృగ వాహనం అశ్వ వాహనం
14-02-2010 నటరాజస్వామి ఉత్సవం రావణాసుర వాహనం
      ధ్వజ అవరోహణం
(సా.6.00 నుండి 7.30 వరకు)

ఈ సందర్భంగా ఆలయంలో ధర్మప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో శివకథా కాలక్షేపం, ఆదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య సంగీత ఆలాపన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.