ఫిబ్రవరి 8వ తేది నుంచి 17వ తేదీ వరకు పిఎసి- 2లో నిత్యాన్నదానం నిలిపివేత‌

ఫిబ్రవరి 8వ తేది నుంచి 17వ తేదీ వరకు పిఎసి- 2లో నిత్యాన్నదానం నిలిపివేత‌

తిరుపతి, 2010 ఫిబ్రవరి 06: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకసౌలభ్యం కోసం భక్తుల వసతి సముదాయమైన  పిఎసి- 2 నందు గతకొంత కాలంగా నిత్యాన్నదానం జరుగుతున్న విషయం తెలిసినదే. పిఏసి-2 లో అన్నదానం నిర్వహిస్తున్న భవనముల మరమ్మత్తుల కారణంగా ఫిబ్రవరి 8వ తేది నుంచి 17వ తేది వరకు 10 రోజుల పాటు నిత్యాన్నదానం నిలిపివేస్తారు. ఈ మార్పును భక్తులు గమనించగలరని మనవి.

భారతరత్న డాక్టర్‌ లతామంగేష్కర్‌ గానం చేసిన అన్నమయ్య సంకీర్తనల సిడిలు తితిదే సేల్స్‌కౌంటర్స్‌ నందు అందుబాటులో వున్నాయి.

తిరుమలలోనూ, తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌నందు, రాష్ట్ర సమాచారకేంద్రం ఎదురుగావున్న విక్రయకేంద్రం నందు, రైల్వేస్టేషన్‌నందు, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంనందు గల విక్రయ కేంద్రాలలో ఈ సిడిలను భక్తులకు అందుబాటులో వుంచడం జరిగింది. ఈ ప్రారంభ సిడిల వెల ఒక్కొక్కటి రూ.200/-లుగా నిర్ణయించడం జరిగింది.  భక్తులు, యాత్రికులు, పురప్రజలకై ఈ సిడిలను పై తెలిపిన విక్రయ కేంద్రాలలో అందుబాటులో వుంచడం జరిగిందని తెలియజేస్తున్నాము.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.