RATHA SAPTHAMI AT ALL TTD LOCAL TEMPLES ON FEB 1 _ ఫిబ్ర‌వ‌రి 1న టిటిడి స్థానికాల‌యాల్లో రథసప్తమి

Tirupati, 29 Jan. 20: TTD is organising grand celebration of the holy Ratha Sapthami at most of its local temples on February 1 on Saturday.

It is a popular practice of TTD to conduct Surya Prabha vahanam as a part of the Ratha Sapthami festival on the day of Surya Jayanti, Magha Sudha Sapthami at all premiere temples like Srivari temple, Sri Padmavathi temple, Tiruchanoor, Sri Govindaraja Swamy Temple, Sri Kodandarama Swamy Temple, Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram.

AT SRI PAT

TTD has organised series of vahanams and a grand Snapana thirumanjanam from 7am.

TTD has also cancelled all arjita sevas including evening break Darshan on the day.

A glittering Aswa Vahanam is also planned at the Sri Suryanarayana temple.

AT SRI GT

Festivities commence at 3 am at the Sri Govindaraja Swamy Temple with chakra snanam and later on seven vahanams will enthral devotees till late evening.

AT SRI KRT

Festivities commence 7am to 900 pm with vahanams and other rituals.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వ‌రి 1న టిటిడి స్థానికాల‌యాల్లో రథసప్తమి

జనవరి 29, తిరుపతి 2020: టిటిడికి అనుబంధంగా ఉన్న స్థానికాల‌యాల్లో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ శ‌నివారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం,  శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన స్వామివారి నుదుట‌న‌, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ‌నివారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.

ర‌థ‌స‌ప్త‌మి కార‌ణంగా ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, సామ‌వేద పుష్పాంజ‌లి, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌తోపాటు సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాన్ని ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వ‌ర‌కు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం క‌ల్పిస్తారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో

 తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వ‌ర‌కు సూర్యప్రభవాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు సూర్య‌ప్ర‌భ వాహ‌నం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్ర‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.