ఫిబ్ర‌వ‌రి 23 నుండి మార్చి 2వ తేదీ వ‌ర‌కు తొండ‌మనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

ఫిబ్ర‌వ‌రి 23 నుండి మార్చి 2వ తేదీ వ‌ర‌కు తొండ‌మనాడులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 22: టిటిడికి అనుబంధంగా ఉన్న‌ తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 23 నుండి మార్చి 2వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం శ‌నివారం సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తిరోజూ ఉద‌యం స్వామి, అమ్మ‌వార్ల‌కు అభిషేకం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి.

కాగా, ఫిబ్ర‌వ‌రి 27న‌ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం  వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్చి 3వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం ఘనంగా జరుగనుంది. ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

వాహనసేవల వివరాలు :

తేదీ                                          ఉదయం               సాయంత్రం

23-02-2020(ఆదివారం)        ధ్వజారోహణం        శేష వాహనం

24-02-2020(సోమ‌వారం)            ——-                 హంస వాహనం

25-02-2020(మంగ‌ళ‌వారం)        ——–                సింహ వాహనం

26-02-2020(బుధ‌వారం)             ——-                  హ‌నుమంత‌వాహ‌నం  

27-02-2020(గురువారం)             ——–                క‌ళ్యాణోత్స‌వం, గ‌రుడ‌వాహ‌నం

28-02-2020(శుక్ర‌వారం)              ——-                   గజ వాహనం

29-02-2020(శ‌నివారం)                ——-                   చంద్రప్రభ వాహనం

01-03-2020(ఆదివారం)        తిరుచ్చి ఉత్స‌వం      అశ్వ‌వాహనం

02-03-2020(సోమ‌వారం)        చ‌క్ర‌స్నానం                ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.