భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి :  తితిదే ఎఫ్‌ఏ అండ్‌ సీఏఓ శ్రీ ఎల్‌.విజయభాస్కర్‌రెడ్డి

భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి :  తితిదే ఎఫ్‌ఏ అండ్‌ సీఏఓ శ్రీ ఎల్‌.విజయభాస్కర్‌రెడ్డి

తిరుపతి, 2012 జూలై 19: తితిదే నిఘా సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు స్థానిక పోలీసులు సమన్వయం చేసుకుని విధులు నిర్వహించాలని, అప్పుడే తిరుమలలో భక్తులకు మెరుగైన భద్రత కల్పించవచ్చని తితిదే ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి శ్రీ ఎల్‌.విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఐదో బ్యాచ్‌ నిఘా, భద్రత మరియు పోలీసు సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం సాయంత్రం ముగిశాయి.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఫ్‌ఏ అండ్‌ సీఏఓ శ్రీ ఎల్‌.విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుని విధుల్లో వాటిని ఆచరించాలని సూచించారు. అనంతరం ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారని, వారిని ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాత్రికుల భద్రత, శ్రీవారి ఆలయ రక్షణను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే విజిఓ శ్రీ ఎం.ఎల్‌.మనోహర్‌, ఏవీఎస్‌వోలు శ్రీ మల్లికార్జున్‌,  శ్రీ శ్రీనివాసులు, రిటైర్డ్‌ డీఎస్పీ జి.నారాయణస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.