మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 25: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్‌ కొనుగోలు చేసి ఊంజల్‌సేవలో పాల్గొనవచ్చు.

– మార్చి 6న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– మార్చి 9న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంట‌ల‌కు ఆస్థానం చేప‌డ‌తారు.

– మార్చి 23 నుండి 31వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు సంద‌ర్భంగా మార్చి 24న‌ అమావాస్య‌నాడు ప్ర‌తి నెల నిర్వ‌హించే సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.