UGADI CELEBRATIONS AT SRI PAT IN TIRUCHANOOR ON MARCH 25 _ మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం

Tirupati, 16 Mar. 20: Sri Sarvarinama Samvatsara Ugadi festivities will be observed at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on March 25 in a religious manner.

After early morning rituals, Kumkumarchana is performed to the utsava idol of Ammavaru at Sri Krishna mandapam.

Later the utsava idol is paraded on the mada streets and thereafter Panchangam shravanam and Ugadi Asthanam will be conducted in a grand manner.

In view of festival celebrations TTD has cancelled all VIP breaks in morning and evening, Arjita kukkumarchana, Sahasra dipalankara seva and unjal sevas.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం

తిరుప‌తి, 16 మార్చి 2020: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 25వ తేదీన‌ ఉగాది ప‌ర్వ‌దినం ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉద‌యం, సాయంత్రం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం, ఆర్జితసేవలైన కుంకుమార్చన, సహస్రదీపాలంకార సేవ, ఊంజ‌ల్‌సేవల‌ను టిటిడి రద్దు చేసింది.  

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.