ANANTAVARAM BRAHMOTSAVAMS _ మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 27 February 2023: The annual brahmotsavams in Sri Venkateswara Swamy temple at Anantavaram will be observed between March 4 and 7 with Ankurarpanam on March 4.

In the auspicious Meena Lagnam, Dhwajarohanam will be observed on March 5 at 7:45am. Important days includes Aswa Vahanam on March 5, Shanti Kalyana Mahotsavam on March 6, Gauda Seva and Dhwajavarohanam on March 7.

While Pushpa Yagam will be observed on March 8.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 4 నుంచి 8వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 27: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుండి 7వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 4న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.

మార్చి 5వ తేదీ ఉదయం 7.45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 6న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు.

మార్చి 7న‌ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వ‌సంతోత్స‌వం, చక్రస్నానం, పూర్ణాహుతి, రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా మార్చి 8న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ఉద‌యం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజ‌ల్‌సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కాగా, ఈ ఆలయంలో మార్చి 4, మార్చి 11, మార్చి 18వ తేదీల్లో ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.