SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE MAHA SAMPROKSHANAM _ మే 11 నుంచి 14వ తేదీ వరకు కపిలతీర్థం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ 

TIRUPATI, 10 MAY 2023: The Maha Samprokshanam rituals in the sub-temple of Sri Lakshmi Narasimha Swamy  Sri Kapileswara Swamy shrine in Tirupati will be observed between May 11 to 14.

 

On May 11, Acharya Varanam, Punyahavachanam, Mrisangrahanam, Ankurarpanam will be observed between 6pm and 8pm. On May 12, Panchagavya Prasana, Vastu Homam, Akalmasha Prayaschitta Homam, Rakshabandhanam, Agni Pratistha, Kumbha Sthapana, Kumbharadhana will be observed.

 

On May 13, various Vaidika rituals in Yagasala including Panchagavyadhivasam, Ksheeradhivasam, Jaladhivasam, Bimbasthapana, Koil Alwar Tirumanjanam in the morning and Navakalasa-Chaturdasakalasa Snapanam, Purnahuti, Sayanadhivasam will be observed by the religious staff.

 

On May 14, Maha Samprokshanam will be observed between 9am and 10am in the auspicious Mithuna Lagnam to Sri Lakshmi Narasimha Swamy followed by darshan to devotees. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

మే 11 నుంచి 14వ తేదీ వరకు కపిలతీర్థం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2023, మే 10: తిరుపతిలోని కపిలతీర్థంలో మే 11 నుంచి 14వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.

మే 11న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.

మే 12న ఉదయం పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం చేపడతారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు.

మే 13న ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిణ్మోచనం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, రత్నన్యాసం, బింబస్థాపన, అష్టబంధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నాయి. సాయంత్రం బింబవాస్తు, నవ కలశ చతుర్దశ కలశ స్నపనం, మహాశాంతి, తిరుమంజనం, పూర్ణాహుతి, శయనాధివాసం చేపడతారు.

మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.