NRISIMHA JAYANTHI ON MAY 14 _ మే 14న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

TIRUMALA, 04 MAY 2022: Nrisimha Jayanthi will be observed in Tirumala temple on May 14.

 

Every year on the advent of Swati Nakshatra in the auspicious Vaisakha month this annual festival is observed.

 

Special Abhishekam is performed to Sri Yoga Narasimha Swamy located in the Tirumala temple complex.

 

On this auspicious occasion special puja of Sri Narasimha Swamy will be observed in Vasanta Mandapam between 3pm and 4:30pm and telecasted live on SVBC for the sake of global devotees. 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మే 14న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

 తిరుమల, 2022 మే 04: తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 14న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ

వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

ఆల‌య ప్రాశస్త్యం :

శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్రాల‌ ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.