AKHANDA SAMPOORNA SUNDARAKANDA PARAYANAM AT DHARMAGIRI ON MAY 16 _ మే 16న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం 

TIRUMALA, 07 MAY 2023: As part of the five day Hanuman Jayanthi Utsavams starting from May 14 to 18, TTD wiil observe Akhanda Sampoorna Sundarakanda Parayanam at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on May 16. 

The unique fete will commence on that day at 5.50am and conclude at 10:30pm lasting for alomst 16hours. This Parayana Yagnam consisting of nearly 2900 shlokas will be recited by 67 Vedic Scholars in different cycles without interruption. 

Besides the Dharmagiri Pundits and students, Vedic scholars from SV Vedic University, National Sanskrit University, SV Higher Vedic Studies and devotees will also participate.

Simultaneously the Homam will also be carried out in Dharmagiri premises seeking the well-being of the entire humanity.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 16న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2023 మే 07: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా మే 16వ తేదీ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌ పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది. ఉద‌యం 5.50 నుండి రాత్రి 10.30 వ‌ర‌కు దాదాపు 16 గంట‌ల పాటు 67 మంది ప్రముఖ పండితులు ఈ అఖండ పారాయణ యజ్ఞన్ని కొనసాగిస్తారు.

హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని సుమారు 2,900 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తారు. హ‌నుమంతుడు విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంత‌రాయంగా సంపూర్ణ సుంద‌ర‌కాండ‌ను పారాయ‌ణం చేస్తారు.

ఇందులో తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.