BTU OF SRI NV TEMPLE FROM MAY 23-31 _ మే 23 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 15 May 2021: TTD is organising the annual Brahmotsavam of Its sub-temple of Sri Narapura Venkateswara temple, Jammalamadugu in YSR Kadapa district from May23-31 in Ekantha in view of Covid guidelines. 

Similarly, the auspicious fete of annual will be performed on the evening of May 22.

TTD will conduct the Dwajarohanam event on May 23 evening in the lagnam between 9.30-10.30 am. Besides daily vahanas, TTD is also poised to conduct daily Snapana thirumanjanam for the Utsava idols and also Pushpa yagam on June 1 night.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 23 నుండి 31వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2021 మే 15: టిటిడికి అనుబంధంగా ఉన్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు లోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 23 నుంచి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మే 22న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

 మే 23వ తేదీ ఉదయం 9.30 నుండి 10.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 31వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.