COVISHIELD FIRST DOSE ON MAY 31 _ మే 31న కేంద్రీయ వైద్యశాలలో టిటిడి ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్

Tirumala, 30 May 2021: The employees of TTD working in Tirumala and Tirupati who have crossed 45years of age will be vaccinated with the first dose of Covishield on May 31 in Central Hospital at Tirupati.

According to Chief Medical Officer Dr Muralidhar, the first dose of vaccination will be done between 9am and 3pm and the employees should wear ID cards and bring their Adhar Cards also while getting vaccinated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 31న కేంద్రీయ వైద్యశాలలో టిటిడి ఉద్యోగులకు కోవిషీల్డ్ మొదటి డోస్ 
 
తిరుపతి, 30 మే 2021: తిరుమల, తిరుపతిలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన టిటిడి రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మే 31న సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో కోవిషీల్డ్ మొదటి డోస్ వేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించి కోవిషీల్డ్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకోగలరు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.