Rs.2LAKHS STOLEN IN LADDU COUNTERS _ లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ

CULPRIT FOUND TO BE AN OLD OFFENDER 

 

FIR LODGED IN TIRUMALA I TOWN POLICE STATION

 

TIRUMALA, 24 JANUARY 2023: An amount of Rs.2lakhs was stolen in the Laddu complex on the wee hours of Tuesday and the culprit was traced by the TTD Vigilance sleuths through CC Cameras. 

 

The incident took place in Counter No.36 when a recently drafted Corporation Employee Sri Raja Kishore kept the amount along with him and slept in the counter without locking the door. When he woke up he noticed that the cash was missing and immediately informed the Security who in turn verified the CCTV footages in Common Command Control Centre. The thief was identified as an old offender Sri Sitapati. 

 

Based on the complaint, Tirumala I Town Police registered FIR and searching for thief. 

 

To avoid such incidents in future, an additional 20 more security guards were immediately drafted to the Laddu Complex. Arrangements have also been made to train the counter boys who are newly drafted for the duty in handling the counters and cash with responsibility etc.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ

– సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు

తిరుమల, 24 జనవరి 2023: తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి రూ.2 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. టిటిడి విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజి ద్వారా అనుమానితుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్ గా విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు ముగించుకుని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రెండు లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మరిచిపోయి కౌంటరులోనే నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ, నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.