AWARDS TO MERITORIOUS AYURVEDA STUDENTS _ విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డుల బహూకరణ

Tirupati, 27 August 2022: TTD on Saturday organised promotional awards to toppers in Sri Ayurveda College for the academic year 2021-22.

 

 

While Kumari Lakshmi Prasanna bagged first prize of ₹15,000 along with Jeevika award, Kumari Gautami bagged ₹10,000 cash award besides the Ayurvisharada award.

 

 

Speaking on the occasion the Principal of the college, Dr Murali Krishna said the awards were sponsored by Himalayan Drugs and such an appreciation of merit helped students to become achievers.

 

 

Company Services Manager Dr Mubarak said his company was keen to promote talented students to sharpen their skills. All house surgeons were presented free graduation starter kits.

 

 

Senior sales manager of Himalayan Drugs Dr. Girish, College vice principal Dr Sundaram, faculty members Dr Renu Dixit, Dr Kishore and students were also present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డుల బహూకరణ

తిరుపతి 27 ఆగస్టు 20 22: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలలో 2021- 2022 సంవత్సరానికి గాను ఉత్తమ ఫలితాలు సాధించిన కుమారి లక్ష్మీప్రసన్నకు మొదటి బహుమతిగా రూ 15 వేలు నగదు బహుమతితో పాటు జీవక అవార్డును, కుమారి గౌతమికి రెండవ బహుమతి గా 10 వేల నగదుతో పాటు ఆయుర్విశారద అవార్డును శనివారం సాయంత్రం అందజేశారు.

కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఇలాంటి అవార్డుల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మంచి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జూనియర్ విద్యార్థులు కూడా ఈ అవార్డును సాధించాలని కష్టపడి చదవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి ప్రోత్సాహక అవార్డులు అందజేసిన హిమాలయన్ డ్రగ్స్ కంపెనీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ కంపెనీ సర్వీసెస్ మేనేజర్ డాక్టర్ ముబారక్ మాట్లాడుతూ, ఆయుర్వేద వైద్య విద్యార్థులు మంచిఫలితాలు సాధించి, ఉత్తమ విద్యార్థులు గా తీర్చిదిద్దడానికి తమ కంపెనీ అనేక ప్రోత్సాహక అవార్డులు అందజేస్తోందని చెప్పారు. హౌస్ సర్జన్లకు గ్రాడ్యుయేషన్ స్టార్టర్ కిట్లు ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సేల్స్ మేనేజర్ డాక్టర్ గిరీష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం, అధ్యాపకులు డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది