SUPRABATHA SEVA RECOMMENCES IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 15 January 2020: As the holy Dhanur masam rituals concluded on Tuesday, the suprabatha seva recommenced in Srivari temple on Wednesday morning on January 15.

It may be recalled that since Dhanur masa began on December 16, as per the traditional Vaikhanasa agama, Suprabatha seva was replaced with Tiruppavai from December 17 onwards till January 14.

The festivities of Goda Parinayotsavam and later Parveta utsavam will be performed on January 16 on the day of Kanuma in Tirumala.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2020 జనవరి 15: పవిత్రమైన ధనుర్మాసం మంగ‌ళ‌వారం ముగియతో బుధ‌వారం ఉద‌యం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభ‌మైంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ బుధ‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.
         

అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయి.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.