TRIBUTES PAID TO SRI SADHU SUBRAMANYA SHASTRI _ శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు

Tirupati, 10 September 2020: Rich tributes were paid to the eminent Epigraphist Sri Sadhu Subramanya Shastri for his contributions in bringing to light the glory of Lord Venkateswara.

On the occasion of the 39th Death anniversary of Sri Shastri, the TTD officials paid floral tributes and garlanded the bronze statue of the first Peishkarbof TTD who had translated all the inscriptions engraved on the walls of Srivari temple.

Sri Suresh Kumar, CEO of SVBC, SVETA Director Sri Ramanjulu Reddy, Telugu scholar Sri Petasri, daughter of Sadhu Shastri Smt Girija Devi, grandson and Judge Sri CM Murthy also participated.

Thereafter a documentary on Sri Sadhu Subramanya Shastri produced by SVBC senior producer Sri BV Ramana was screened at the SVETA auditorium.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు

తిరుపతి, 2020 సెప్టెంబరు 10: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని ప‌లువురు అధికారులు నివాళులు అర్పించారు. శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 39వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా గురువారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నం ఎదురుగా గ‌ల ఆయ‌న కాంస్య విగ్ర‌హానికి ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, శ్వేత సంచాల‌కులు శ్రీ రామాంజులురెడ్డి, ఎస్వీ యూనివ‌ర్సిటీ తెలుగు ఆచార్యులు శ్రీ పేట‌శ్రీ,  ‌శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి కుమార్తె శ్రీ‌మ‌తి గిరిజాదేవి, మ‌న‌వ‌డు, జ‌డ్జి శ్రీ సిఎం.మూర్తి పుష్పాంజ‌లి ఘ‌టించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌మ‌తి సాధు గిరిజాదేవి మాట్లాడుతూ త‌న తండ్రి టిటిడికి చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ప్ర‌తి ఏటా ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు. శ్వేత సంచాల‌కులు శ్రీ రామాంజులురెడ్డి మాట్లాడుతూ శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు చెప్పారు. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని వివ‌రించారు.

ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, జడ్జి శ్రీ సిఎన్.మూర్తి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఆచార్య పేట‌శ్రీ‌ని శ్వేత సంచాల‌కులు సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. అనంత‌రం ఎస్వీబీసీ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ శ్రీ బివి.ర‌మ‌ణ రూపొందించిన శ్రీ సాధు సుబ్ర‌మ‌ణ్య‌శాస్త్రి డాక్యుమెంట‌రీని శ్వేత‌లోని స‌‌మావేశ మందిరంలో ప్ర‌ద‌ర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.