TIRUPATI JEO REVIEWS ON SKVST DEVELOPMENT _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య అభివృద్ధిపై జెఈవో స‌మీక్ష‌

Tirupati, 25 Nov. 21: TTD JEO Sri Veerabrahmam on Thursday inspected the ongoing development works at Srinivasa Mangapuram.

During the review meeting with officials in the temple premises, he directed the concerned to make accommodation arrangements for devotees and Archakas near Kalyana Mandapam. He also instructed to bring Sri Krishna Deva Raya Sadan into public utility soon.

The JEO also said to initiate measures to ensure that rain water does not enter inside the temple. He directed to erect display boards with the necessary information for the sake of devotees. The officials were directed to send the proposals of development works to Archaeological authorities for prior permission.

He said, soon there will be review meeting on Vaikunta Ekadasi arrangements.

Later he also visited SV Ayurveda Pharmacy in Narsingapuram and verified the preparation of medicines.

ASI Official Sri Satyam, temple DyEO Smt Shanti, EE Sri Murali, AEO Sri Dhananjeyudu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య అభివృద్ధిపై జెఈవో స‌మీక్ష‌

తిరుపతి, 2021 న‌వంబరు 25: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం గురువారం ఆల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ క‌ల్యాణ మండ‌పం వ‌ద్ద భ‌క్తుల‌కు, అర్చ‌కుల‌కు వ‌స‌తి క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. శ్రీ‌వారిమెట్టు వ‌ద్ద శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ స‌ద‌న్‌ను భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. వ‌ర్ష‌పునీరు రోడ్డుపై నుండి ఆల‌యంలోకి రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యం గురించి తెలిసేలా సైన్‌బోర్డులు త్వ‌రిత‌గ‌తిన ఏర్పాటు చేయాల‌న్నారు. వైకుంఠ ఏకాద‌శి రోజున భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అభివృద్ధి ప‌నులకు గాను పురావ‌స్తు శాఖ అధికారుల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని కోరారు. త్వ‌ర‌లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.

అనంత‌రం ఆయ‌న న‌ర‌సింగాపురం వ‌ద్ద‌నున్న ఆయుర్వేద ఫార్మ‌శీని సంద‌ర్శించి, అక్క‌డ త‌యార‌వుతున్న ఆయుర్వేద మందుల గురించి అధికారుల‌తో చ‌ర్చించారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను జెఈవో ఆదేశించారు.

ఈ స‌మావేశంలో పురావ‌స్తు శాఖ అధికారి శ్రీ స‌త్యం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఇఇ శ్రీ ముర‌ళి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.