FLOAT FESTIVAL POSTERS OF SRI GT RELEASED _ శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌

Tirupati, 16 Feb. 21: The colourful posters of the Week long float festival of Sri Govindaraja Swami temple from February 20-26 was released by temple special grade DyEO Sri Rajendrudu on Tuesday.   

Every day in different alankaram Sri Govindarajaswami will ride on richly decorated floats in the Sri Govindaraja Swamy Pushkarini in the evenings between 6.30pm and 8.00 pm and bless the devotees.

Following is the schedule of alankarams and the number of rounds.

February 20:Sri Kodandarama Swamy-5 rounds.

February 21: Sri Parthasarathy Swamy-5 rounds

February 22: Sri Kalyana Venkateswara Swamy-5 rounds

February 23: Sri Krishna Swamy along with Sri Andal Ammavaru-5 rounds 

February 24,25,26: Sri Govindaraja Swamy- 7 rounds

The artists of HDPP and the Annamacharya project will perform bhajans, Harikatha and sangeet programs at the Sri Govindaraja Swamy Pushkarini during float festival days.

Temple chief priest Sri Srinivasa Acharyulu AEO Sri Ravikumar Reddy, Superintendent Sri Rajkumar and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల పోస్టర్లు ఆవిష్కర‌ణ‌

తిరుపతి,  2021 ఫిబ్ర‌వరి 16: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల పోస్టర్లను ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు మంగ‌ళ‌వారం శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో ఆవిష్కరించారు.

శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ  వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఫిబ్రవరి 20న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 21న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 23న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీ కృష్ణస్వామివారు – 5 చుట్లు

ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు       – 7 చుట్లు.

ఈ సందర్భంగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పుష్క‌రిణి వ‌ద్ద టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో  ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస ఆచార్యులు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామరాజు‌, శ్రీ కృష్ణ‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.