శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల మార్పు

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల మార్పు

– ఉప ఆలయాలలో దర్శనాల రద్దు : టిటిడి

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 29: తిరుప‌తి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భ‌క్తుల‌కు దర్శన స‌మాయాన్నిమే 1వ తేదీ శ‌నివారం నుండి మార్పు చేస్తున్న‌ట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కోవిగ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో టిటిడి స్వామివారి ద‌ర్శ‌న స‌మ‌యంలో మార్పు చేస్తూ, ఉప ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసింది.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలుపుతారు. అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహిస్తారు. ఈ సేవల కాలంలో భక్తులకు స్వామి వారి లఘు దర్శనం కల్పిస్తారు.

ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు, 9.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు మద్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారి దర్శనమునకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరము రాత్రి 7 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

అదేవిధంగా, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలోని ఉప ఆలయాలలో భ‌క్తుల‌కు దర్శనాలను ర‌ద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేయడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.