శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల‌లో ఆకట్టుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

 తిరుపతి, 2022 న‌వంబ‌రు 26 ;శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు శ్రీ కేసన్న శ్రీ రామ చంద్రయ్య బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు నంద్యాలకు చెందిన శ్రీ దేవి హయగ్రీవాచార్య ధార్మిక ఉపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన రాధిక బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి చిన్నమ్మ దేవి బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన కళ్యాణి బృందం అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్ వారి వెంకటలక్ష్మి నాటకం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి తిరుపతికి చెందిన శ్రీ అనంత కృష్ణ ఫ్లూటు శ్రీ సుధాకర్ మృదంగం శ్రీమతి పూర్ణ వయోలిన్ వాద్య సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద శ్రీ సాయిలు ఒగ్గు కథ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి విజయవాడకు చెందిన శ్రీ ఆనంద్ నృత్య కార్యక్రమం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.