ANKURARPANAM FOR PUSHPA YAGAM OF SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE AT APPALAYAGUNTA HELD _ శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 6 Jul. 20: TTD organised grand Ankurarpanam on Monday evening for the annual Pushpa Yagam festival of the Sri Prasanna Venkateshwara temple at Appalayagunta which is on July 7.

After the morning rituals, Snapana thirumanjanam will be performed for the utsava idols of Sri Prasanna Venkateshwara and his consorts tomorrow.

Later in the afternoon, Pushpa Yagam will be conducted with a variety of flowers. The Pushpayagam will be conducted in Ekantham inside the temple in view of the COVID-19 restrictions.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2020 జూలై 06: అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 7వ తేదీ మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌నున్న‌ వార్షిక పుష్పయాగానికి సోమ‌వారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేధినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం,  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించ‌నున్నారు.

జూలై 7వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
 
మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం ఏకాంతంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

జూన్ 2 నుండి 10వ తేదీ వరకు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.