POSTERS OF SURYA PUJYOTSAVAM OF NAGALAPURAM TEMPLE RELEASED _ శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల పోస్ట‌ర్లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 21 Mar. 22: TTD JEO Sri Veerabrahmam on Monday released the posters of the annual Surya Pujyotsavam and teppotsavam of Sri Vedavalli Sameta Veda Narayana temple of Nagalapuram scheduled between March 24-28.

 

Speaking on the occasion at the TTD administrative buildings, the TTD JEO said as part of Surya Puja Mahotsavam snapana thirumanjanam fete will be performed for swami and ammavaru on all days in the morning. After Surya puja darshan in the evening, Swami and Ammavaru blessed devotees on Float as part of Teppotsavam and thereafter participated in Thiru veedhi utsavam.

 

TTD is organizing a five-day annual float festival from March 24-28. During the fete on first three days, Swamy and Ammavaru will participate in Tiruchi utsavam and on the fourth n fifth-day swami will bless devotees on Sarva Bhupala vahana and Pedda Sesha vahana respectively.

 

TTD is organizing grand Matsya Jayanti at Sri Veda Narayana temple on April 3. The festivities included Shanti homam, snapana thirumanjanam and finally Garuda vahana seva at night,

 

The TTD annamacharya project artists will perform cultural programs including bhajans, sankeertans etc.

 

TTD Special grade DyEo Smt Parvati, temple inspector Sri Anjaneyulu and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వేదనారాయణస్వామివారి సూర్యపూజోత్సవం, తెప్పోత్సవాల పోస్ట‌ర్లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2022 మార్చి 21: నాగలాపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల పోస్ట‌ర్ల‌ను టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం సోమ‌వారం ఉద‌యం ఆవిష్క‌రించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తార‌న్నారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ దర్శనం కల్పించనున్న‌ట్లు చెప్పారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు తెప్ప‌పై స్వామి, అమ్మ‌వార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌న్నారు. అనంత‌రం రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

మార్చి 24 నుండి తెప్పోత్సవాలు :

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుండి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, నాలుగు, ఐద‌వ‌ రోజుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామి, అమ్మవార్ల (తిరుచ్చి) తిరువీధి ఉత్సవం, నాల్గవ రోజు స‌ర్వ‌భూపాల వాహనం, ఐదవ రోజు పెద్ద‌శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఏప్రిల్ 3న మత్స్య జయంతి :

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 3వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఆంజ‌నేయులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.