TRADITIONAL DRESS- TIRUNAMAM _ సంప్రదాయ వస్త్రధారణ – తిరునామం

* SRIVARI SEVAKULU RENDER UNIQUE SERVICE AT NELLORE

 

Nellore,20, August 2022:  The Srivari Sevakulu stood role model to devotees by donning traditional attire and wearing Tirunamam on their forehead at the Sri Venkateshwara Vaibhavotsavam fete at Nellore.

 

They enhanced the devotional elixir of the event by inspiring the devotees to wear Tirunamam and come in traditional Indian attire.

 

The women Srivari Sevakulu in their bright sarees and men in Pancha and Kanduva or kurta pyjama attire were a major attraction at the fete,

 

They rendered service by organising queue lines, distributed Anna Prasadam and also Tirunamam service.

 

LEGEND OF SRIVARI TIRUNAMAM

 

The main idol of Sri Venkateshwara is donned with the Tirunamam of sandal powder, karpooram, and Kasturi once in a week after the Friday Abhisekam.

 

On Thursdays, during the Sadalimpu period (when ornaments are changed) Tirunamam is slightly reduced to make lords eyes fosinle. The Tirunamam also hailed as Tirumanikappu comprised, of 16 tolas of pachcha karpooram and 1.5 tolas of Kasturi.

 

The bright red figure in the Tirunamam signified the Atma (soul). Many devotees wear Tirunamam on their shoulders, chest, back etc. indicating that they were ardent followers and Sevaks of Sri Venkateshwara.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంప్రదాయ వస్త్రధారణ – తిరునామం

– నెల్లూరులో విశేష సేవ‌లు అందించిన శ్రీ‌వారి సేవ‌కులు

నెల్లూరు, 2022 ఆగ‌స్టు 20: నెల్లూరులో జరుగుతున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు స్వచ్ఛందంగా సంప్రదాయ వస్త్రధారణ, తిరునామం పాటిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైభవోత్సవాలకు విచ్చేసిన భక్తుల నుదుటన తిరునామం కనువిందు చేస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా, భక్తుల హృదయాల్లో శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంచేందుకు తిరునామం ఎంతగానో దోహదపడుతుంది.

సనాతన హిందూ ధర్మంలో తిలకధారణతోపాటు సంప్రదాయ వస్త్రధారణను తప్పనిసరిగా భక్తులు పాటిస్తారు. మహిళలు చీరలు, పురుషులు పంచ, కండువా లేదా కుర్తా పైజామా ధరిస్తున్నారు.

శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో స్థానిక సేవకులు క్యూలైన్ల క్రమబద్ధీకరణ, అన్నప్రసాద వితరణతోపాటు తిరునామధారణ సేవలు అందిస్తున్నారు.

శ్రీవారి తిరునామం :

శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు(ఆభరణాలు తొలగించే) సమయంలో కళ్లు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తుంటుంది. ఈ నామాన్ని తిరుమణికాప్పు అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, ఒకటిన్నర తులం కస్తూరిని ఉపయోగిస్తారు.

తిరునామంలో ఎర్రటికాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంత మంది భక్తులు భుజాలు, ఛాతీపైన, వీపుపై తిరునామం ధరిస్తారు. తిరునామం అంటే స్వామివారి పవిత్రనామం అని అర్థం. భక్తులు కనుబొమల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించినవారు శ్రీవేంకటేశ్వరుని సేవకులని సులువుగా గుర్తించవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.