11 ADDITIONAL FOOTREST COUNTERS IN TIRUMALA-TTD EO _ భక్తుల కోసం 11 ప్రాంతాల్లో పాదరక్షల కౌంటర్లు- టిటిడి ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి

Tirumala,28 February 2023: TTD EO Sri AV Dharma Reddy directed officials to install 11 more footrest counters at Tirumala by April second week.

Addressing a review meeting at his chambers in Tirumala on Tuesday, the TTD EO said the counters will be set up at Kalyana Katta, Annaprasadam complex, TBC bridge, Narayanagiri shed, Vaikunta queue complex-2, ATC circle, Vaibhavotsava Mandapam, Supatham, between Kalyana katta to Bedi Anjaneya temple,all PACs, Srivari Seva Sadan 1 and 2.

Among others TTD EO directed engineering, marketing officials to set up markers at footrest centres for devotees to identify easily and instructed PRO to depute Srivari Sevakulu. He said till all the centres get ready, the counters will function under VGO Tirumala.

SE-2 Sri Jagadeeswar Reddy, VGO Sri Bali Reddy, DE( electrical) Sri Ravishankar Reddy, Health officer Dr Sridevi, DyEOs Sri Bhaskar, Sri Harindranath, catering OSD Sri Shastri and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల కోసం 11 ప్రాంతాల్లో పాదరక్షల కౌంటర్లు

– ఏప్రిల్ రెండో వారంలోపు సిద్ధం

– టిటిడి ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుమల, 2023, ఫిబ్రవరి 28: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సౌకర్యవంతంగా పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వీలుగా ఏప్రిల్ రెండవ వారంలోపు 11 కౌంటర్లు సిద్ధం చేస్తామని టిటిడి ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని తమ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కళ్యాణకట్ట ప్రవేశ మార్గం, అన్నదానం కాంప్లెక్స్ ప్రవేశ మార్గం, టిబిసి బ్రిడ్జి నారాయణగిరి షెడ్ల మధ్య ఉన్న ప్రాంతం, నారాయణగిరి షెడ్ల ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ఎదురుగా, ఏటీసీ సర్కిల్ వద్ద, వైభవోత్సవ మండపం వద్ద, సుపథం వద్ద, కళ్యాణకట్ట నుంచి బేడి ఆంజనేయ స్వామి ఆలయం మధ్య ఉన్న ఆర్చి వద్ద, పీఏసీల వద్ద, శ్రీవారి సేవాసదన్-1,2 వద్ద ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కౌంటర్లు తాత్కాలికంగా విజిఓ ఆధ్వర్యంలో పనిచేస్తాయని, ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఈ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటర్ల వద్ద అవసరమైన ఎల్ఇడి లైటింగ్, బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటర్లలో పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వినియోగించే సంచులను కొనుగోలు చేయాలని మార్కెటింగ్ విభాగం అధికారులను కోరారు. భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని పిఆర్వోను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, డిఇ ఎలక్ట్రికల్స్ శ్రీ రవిశంకర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డెప్యూటీ ఈఓలు శ్రీ భాస్కర్, శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.