12 EDITION PARAYANAM HELD _ భక్తిభావాన్ని పంచిన బాలకాండ అఖండ పారాయ‌ణం

TIRUMALA, 24 SEPTEMBER 2022: The 12th Edition of Balakanda Akhanda Parayanam was held in Nadaneerajanam at Tirumala on Saturday between 7am and 9am which was telecasted live on SVBC for the sake of global devotees.

 

A total of 129 shlokas from 56-60 chapters were recited by Vedic pundits, scholars, students of veda vignana peetham, and devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిభావాన్ని పంచిన బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 24: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌నివారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 12వ‌ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా సాగింది.

ఇందులో 56 నుండి 60 సర్గల వ‌ర‌కు గ‌ల 129 శ్లోకాలను పారాయణం చేశారు. యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు.

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య ప్రవా రామ‌కృష్ణ సోమ‌యాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ కె.రామానుజాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.