132nd JAYANTHI OF SRI VETURI PRABHAKARA SHASTRI ON FEB 07 _ ఫిబ్రవరి 7న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 132వ జయంతి ఉత్సవం

Tirupati, 6 Feb. 20: TTD is organising the 132nd Jayanti utsavam of well known epigraphist and historian Sri Veturi Prabhakar Shastri on February 7.

Senior TTD officials will garland his statue at SVETA  bhavan in the morning and later conduct a memorial meeting at the Sri Venkateswara Oriental College in which prominent exponents will speak on the Literature and works of Sri Prabhakar Shastri. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 7న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 132వ జయంతి ఉత్సవం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 06: టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ప్రాచ్య క‌ళాశాల‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 132వ జయంతి ఉత్సవాలను తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి టిటిడి ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు. అనంత‌రం తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ప్రాచ్య క‌ళాశాల‌లో ఉదయం 10.30 గంటల నుంచి స్మారకోపన్యాస సభ నిర్వహిస్తారు. ఇందులో వేటూరివారి సాహిత్యంపై ప్రముఖ పండితులు ఉపన్యసిస్తారు.

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా, తొలి తెలుగు పదమైన ‘నాగబు’ను గుర్తించిన పరిశోధకుడిగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా, అన్నమయ్య సంకీర్తన సాహిత్యోద్ధారకుడిగా, అన్నమాచార్య ఉత్సవాల ప్రథమ ప్రారంభకుడిగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి తితిదేకి అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.