YOGA HELPS REMOVE STRESS- SPEAKERS _ యోగాతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు- ఎస్వీ ఆయుర్వేద కళాశాల అధ్యాపకులు
Tirupati, 20 June 2023: The faculty of Ayurveda expounded that Yoga practice helps to resolve issues of stress and enhances concentration improving health.
The ayurveda exponents were addressing the students of SPW Degree and PG college on Tuesday in Tirupati in a three-day yoga training program in connection with the International Yoga Day on June 21.
Dr Muralikrishna Principal of SV Ayurveda Hospital, vice principal Dr Sundaram, Yoga wing chief Dr Lakshminarayana, SPW college Principal Dr Mahadevamma and other teachers and students were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
యోగాతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు- ఎస్వీ ఆయుర్వేద కళాశాల అధ్యాపకులు
తిరుపతి, 2023 జూన్ 20: ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా మంగళవారం ఎస్పీ డబ్ల్యు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు నిత్యం యోగా అభ్యాసం చేయవలసిన అవసరాన్ని అధ్యాపకులు వివరించారు. ఆరోగ్య పరిరక్షణ, మానసిక ఏకాగ్రత, జ్ఞాన సమపార్జన, యువతలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. త్రికరణ శుద్ధిగా చేసే ప్రతి పని యోగా యేనని, యువత వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, యోగ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్పీడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి మహదేవమ్మ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.