PAVITROTSAVAMS IN TIRUCHANOOR _ సెప్టెంబరు 10న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 08 September 2024: The annual Pavitrotsavams in Tiruchanur will be from September 16-18 with Ankurarpanam on September 15.
The Koil Alwar Tirumanjanam in connection with this fete will be observed on September 10.
On first day Pavitra Pratista, second day Pavitra Samarpana, final day Pavitra Purnahuti will be observed.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 10న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 సెప్టెంబరు 08: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 10న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుండి 18వ తేదీ వరకు
పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
సెప్టెంబరు 16న పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.